నెల్లూరులో 28 వాహనాలు సీజ్

18చూసినవారు
నెల్లూరులో 28 వాహనాలు సీజ్
నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల ఆదేశాల మేరకు, శనివారం నెల్లూరు నగరంలోని మనుమ సిద్ది నగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా 194 ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 26 బైకులు, ఒక కారు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రౌడీషీటర్లను పిలిచి మందలించారు. సైబర్ నేరాలు, భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించి, అనుమానితుల సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యాచరణలో పెద్ద ఎత్తున పోలీసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :