ఘనంగా రంగనాథుని 'హనుమంత వాహన' సేవ

4చూసినవారు
ఘనంగా రంగనాథుని 'హనుమంత వాహన' సేవ
నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన సోమవారం రాత్రి, స్వామివారు అత్యంత వైభవంగా హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 9 గంటలకు రమణీయంగా అలంకరించిన వాహనంపై రంగనాథస్వామి వారు విహరించారు. భగవంతుడికి అత్యంత ప్రియ భక్తుడైన హనుమంతునిపై స్వామివారు విహరిస్తున్న దృశ్యం భక్తులను పరవశింపజేసింది. వాహన సేవ పొడవునా భక్తులు గోవింద నామస్మరణలతో స్వామివారికి మంగళ హారతులు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్