నెల్లూరు నగరంలోని స్టోన్ హోస్పేట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా కార్యాలయంలోని పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. అలాగే, సిబ్బంది, అధికారుల వద్ద ఉన్న నగదును లెక్కించారు. ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులతో అక్కడున్న డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు. ఈ సంఘటనతో కార్యాలయంలో కలకలం రేగింది.