నెల్లూరు రూరల్ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్, కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార, అభినందన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సతీమణి కోటంరెడ్డి సుజిత, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. దేవస్థానం చరిత్రలో తండ్రీ, కుమారుడు చైర్మన్ లు కావడం ఇదే ప్రథమమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.