ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఏటి పండుగను ఈ సంవత్సరం అన్ని తెలుగు జిల్లాల్లో సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు, ఈ నెల 17న నిర్వహించనున్న ఏటి పండుగకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను శనివారం పెన్నానది సమీపంలోని తిక్కన పార్కు వద్ద ఆర్డీవో అనూష, మున్సిపల్ కమిషనర్ నందన్‌లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.