అద్భుతం అయోధ్య నమూనా ఆలయం: పొంగూరు రమాదేవి

468చూసినవారు
అద్భుతం అయోధ్య నమూనా ఆలయం: పొంగూరు రమాదేవి
ఆదివారం నెల్లూరు ఏస్వీజీఎస్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అయోధ్య బాల రాముడి నమూనా ఆలయాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి దర్శించారు. టీడీపీ, జనసేన మహిళా నేతలతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు రమాదేవికి ఘన స్వాగతం పలికి, స్టాల్స్ సందర్శించగా, ఆమె 'సాక్షాత్తు ఆ అయోధ్య రామ మందిరమే మన నెల్లూరు నగరానికి తరలివచ్చినట్లుగా ఉందని' అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్