నెల్లూరులోని బాలాజీ నగర్ పరిధిలో శుక్రవారం రాత్రి, వేగంగా వస్తున్న కారు స్థానిక స్వామి దాసు స్కూలు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం విరిగి కారుపై పడింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో అక్కడ ప్రజల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు ఢీకొట్టగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కారు ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.