క్యాటరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ జన్మదిన వేడుకలు

0చూసినవారు
క్యాటరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ జన్మదిన వేడుకలు
నెల్లూరు జిల్లా క్యాటరింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్ జన్మదిన వేడుకలను నెల్లూరులో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పప్పులు వీధిలోని వందన కేటరింగ్ లో క్యాటరింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ హరిణి హోటల్, హరిణి క్యాటరింగ్ అధినేత సిహెచ్ పెంచలయ్య (సీపీ) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. వినయ్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్యాటరింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు రవి, రాజు, శ్రీనివాసులు, రంజిత్, సుమన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్