68 మందికి రూ. 69 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

981చూసినవారు
68 మందికి రూ. 69 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
గురువారం నెల్లూరులోని విపిఆర్‌ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 68 మంది లబ్ధిదారులకు రూ. 69 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, తమ పరిధిలో రూ. 10 కోట్ల విలువైన చెక్కులను అందజేసినట్లు ఎంపీ తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో నిధులు విడుదల చేస్తున్నారని, కోవూరు నియోజకవర్గంలో గత 23 నెలల్లో 804 మందికి రూ. 8.47 కోట్ల ఆర్థిక సాయం అందించామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్