సురక్షిత త్రాగునీటి సరఫరా నిర్వహణ పరిశీలించిన కమిషనర్

571చూసినవారు
సురక్షిత త్రాగునీటి సరఫరా నిర్వహణ పరిశీలించిన కమిషనర్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్, మంగళవారం 36వ డివిజన్ పరిధిలోని బ్రహ్మానందపురం, అంబేద్కర్ నగర్ ప్రాంతాలలో మెగా ఇంజనీరింగ్ వర్క్స్ తాగునీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. అధికారులతో కలిసి పర్యటించిన ఆయన, తాగునీటి సరఫరా నిర్వహణ తీరును పర్యవేక్షించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారి సమక్షంలోనే తాగునీటి నాణ్యతను పరీక్షించి, ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్