నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్, మంగళవారం నాడు 36 వ డివిజన్ పరిధిలోని బ్రహ్మానందపురం, అంబేద్కర్ నగర్ ప్రాంతాలలో మెగా ఇంజనీరింగ్ వర్క్స్ తాగునీటి సరఫరా వ్యవస్థను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా, సురక్షిత తాగునీటి సరఫరా నిర్వహణ తీరును పర్యవేక్షించి, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.