నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని గుంటూరు పోలీసులు పీటీ వారెంట్‌పై తమ అదుపులోకి తీసుకుని మంగళవారం గుంటూరుకు తరలించారు. సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో కోర్టులో హాజరు చేయనున్నారు. అలాగే ప్రైవేట్ టోల్ గేట్ ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే.