ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఏడు జన్మలెత్తినా సరే మీకు లొంగను: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ
May 30, 2026, 15:05 IST/

ఏడు జన్మలెత్తినా సరే మీకు లొంగను: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ

May 30, 2026, 15:05 IST
టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసులో బెంగాల్ సీఐడీ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి నోటీసులు జారీ చేసింది. శనివారం ఆయన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో, కాళీఘాట్‌లోని మరో కార్యాలయంలో నోటీసులు అందించారు. సోమవారం భవానీ భవన్‌లోని సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ.. తనను భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నారని, తాను లొంగే వ్యక్తిని కాదని, ఏడు జన్మలెత్తినా లొంగేది లేదని, దేశద్రోహిని కాదని అన్నారు.