శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ములుమూడి గ్రామంలో జరిగిన ములుమూడమ్మ తిరునాళ్ళ మహోత్సవంలో టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, ఎద్దుల పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, వేమిరెడ్డి సురేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.