బుధవారం మధ్యాహ్నం కోవూరు మండలం పెద్ద పడుగు పాడులో ఒక గడ్డివాము అగ్నికి ఆహుతైంది. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మంటలు పక్కనున్న ఇతర గడ్డివాములకు వ్యాపించకుండా అప్రమత్తమయ్యారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.