నెల్లూరు జిల్లా, వనంతోపు సెంటర్‌లోని బిగ్ బాస్కెట్ ఆన్‌లైన్ ఆహార వ్యాపార సంస్థను ఆహార భద్రత శాఖ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. ఒక వినియోగదారుడు సరఫరా చేసిన పెరుగు డబ్బాపై గడువు తేదీ ముగిసినట్లు గుర్తించి, ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీ జరిగింది. స్టోర్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించగా, గడువు ముగిసిన పలు ఉత్పత్తులు వినియోగదారులకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.