అంతర్జాతీయ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ. 2 కోట్లు సీజ్

1చూసినవారు
నెల్లూరులో బెట్టింగ్ ముఠా మరోసారి పట్టుబడింది. దుబాయ్ రాదే ఎక్స్చేంజి యాప్ ద్వారా బెట్టింగ్ దందా నడుపుతున్న పొడివాటి మహేశ్ బాబు, పొడివాటి హరికృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక బాధితుడిని 53 లక్షల రూపాయలు మోసం చేసిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 34.65 లక్షల నగదు, బ్యాంకుల్లోని రూ. 1.64 కోట్లు, 13 సెల్ ఫోన్లు, లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ దీక్ష ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బాలాజీ నగర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్