అంతర్జాతీయ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ. 2 కోట్లు సీజ్

0చూసినవారు
నెల్లూరులో మరోసారి బెట్టింగ్ ముఠా పట్టుబడింది. దుబాయ్ రాదే ఎక్స్చేంజి యాప్ ద్వారా బెట్టింగ్ దందా నడుపుతున్న పొడివాటి మహేశ్ బాబు, పొడివాటి హరికృష్ణ అనే ఇద్దరు నిందితులను బాలాజీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక బాధితుడిని 53 లక్షల రూపాయలు మోసం చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. వీరి వద్ద నుంచి రూ. 34.65 లక్షల నగదు, బ్యాంకుల్లోని రూ. 1.64 కోట్లు, 13 సెల్ ఫోన్లు, ఒక లాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ దీక్ష మంగళవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్