నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండలోని వేదగిరి లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్య అర్చకులు మాధవగిరి భాస్కరాచార్యులు, చైర్మన్ ఇందుపూరు అచ్యుత శంకర రెడ్డి, కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో వేద మంత్రాలతో, వైఖానస ఆగమము ప్రకారము పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న గరుడ సేవ, గిరిప్రదక్షిణ ఘనంగా జరిగాయి.