ఇంటింటిటికీ వెళ్లి పెన్షన్ లు అందించిన కోటంరెడ్డి

0చూసినవారు
ఇంటింటిటికీ వెళ్లి పెన్షన్ లు అందించిన కోటంరెడ్డి
నెల్లూరు నగరంలోని 35వ డివిజన్ ప్రగతి నగర్ పైప్ లైన్ వీధిలో శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు రూ. 4 వేల పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం 4 వేల పెన్షన్ అందిస్తున్నది తమ ప్రభుత్వమని, పెన్షన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.