నెల్లూరు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జూటూరు మహేష్ శర్మ, నెల్లూరు రంగనాథ స్వామి దేవస్థానం బోర్డు సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆయనను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నగర అధ్యక్షుడు సుజయ్ బాబు కూడా మహేష్ శర్మను సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో 40వ వార్డు జనసేన అధ్యక్షులు చిత్తూరు రాము, 47వ వార్డు జనసేన అధ్యక్షులు శ్రీమంతుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.