శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర వారి దేవస్థానం వద్ద కార్తీక మాసం రెండో సోమవారం పురస్కరించుకొని కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మధు, ప్రవీణ్, సునీత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. సాయంకాలం అర్చకులు ఫణీంద్ర శర్మ మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. కార్తీక మాసం 14వ రోజున స్వామి వారికి ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని పోనూరు మాధవరెడ్డి, గాయత్రి దంపతుల సహకారంతో నిర్వహించారు.