కాలువల నిర్మాణానికి మార్కింగ్ పనులను పూర్తి చేయాలి

2చూసినవారు
కాలువల నిర్మాణానికి మార్కింగ్ పనులను పూర్తి చేయాలి
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్, స్థానిక 20వ డివిజన్ ఇస్కాన్ సిటీ ప్రాంతంలో డ్రైనేజీ కాలువల నిర్మాణ ప్రణాళికలను శుక్రవారం ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కాలువల నిర్మాణానికి అవసరమైన మార్కింగ్ పనులను వెంటనే ప్రారంభించి, నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కాలువల నిర్మాణం అనంతరం వాటిపై ఎలాంటి నిర్మాణాలను చేపట్టకుండా పర్యవేక్షించాలని, మురుగునీరు సాఫీగా ప్రవహించేలా నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్