నూతన మేయర్ గా ఎన్నికైన దేవరకొండ సుజాత, నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్ లోని శాసన మండలి సభ్యులు, టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్ సుజాత బీద రవిచంద్ర ను శాలువతో సత్కరించారు. బీద రవిచంద్ర మేయర్ కు శుభాకాంక్షలు తెలిపి, నెల్లూరు నగర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.