నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి

633చూసినవారు
నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి
నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెంచలకోనలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా, మంగళవారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వామి వారిని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని, అమ్మవార్లను వేడుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్