కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరులోని తన క్యాంప్ కార్యాలయంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానించి, వారికి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా మాయలో పడి చదువులను నిర్లక్ష్యం చేయవద్దని, సాంకేతికతను జ్ఞాన సముపార్జనకే వాడుకోవాలని సూచించారు. మంత్రి నారా లోకేష్ మాటలను ఆదర్శంగా తీసుకోవాలని, అపజయాలకు కుంగిపోకుండా లక్ష్య సాధన దిశగా సాగాలని పిలుపునిచ్చారు. 10వ తరగతి టాపర్ మానసను అభినందిస్తూ, నియోజకవర్గంలో ఉపాధి అవకాశాల మెరుగుదలకు హామీ ఇచ్చారు.