కృష్ణపట్నం గ్రామంలో వైభవంగా మొలక పోలేరమ్మ జాతర

3చూసినవారు
కృష్ణపట్నం గ్రామంలో వైభవంగా మొలక పోలేరమ్మ జాతర
ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో మంగళవారం మొలకపోలేరమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, పుట్ట బంగారం సమర్పించి, అమ్మవారి ప్రతిమను నూతనంగా ఏర్పాటు చేసిన పూరిపాకలో ప్రతిష్టించారు. భక్తులు కొబ్బరికాయలు, పండ్లు, పొంగలితో నైవేద్యం సమర్పించి, కోళ్లు, మేకలు, గొర్రెలను బలిదానం చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతరలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్