నెల్లూరు నవాబుపేటలో ఉన్న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఆర్యవైశ్య మహాలక్ష్మీ అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం పునః నిర్మాణంపై కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయాన్ని భక్తుల సహకారంతో పునః నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. 2024 ఏప్రిల్ లో ఆలయ పునః నిర్మాణ పనులు మొదలు పెట్టారని, కొనసాగుతున్నాయన్నారు.