నాయుడుపేటలోని అంబేద్కర్ భవన్‌లో బుధవారం నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కాలవపల్లి సహదేవయ్య మాట్లాడుతూ, వెంకటగిరిలోని నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ద్వారా అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.