నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, గురువారం స్థానిక సంతపేటలోని శ్రీ సింహపురి గ్లాస్ అండ్ ప్లైవుడ్ సంస్థను సందర్శించి, 12,13,412 రూపాయల ఆస్తి పన్ను బకాయిలను స్వయంగా వసూలు చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులు, అడ్మిన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ చర్య ద్వారా పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమైంది.