నెల్లూరు విజయ మహాల్ గేటు సమీపంలోని జీకే స్పెషాలిటీ హాస్పిటల్లో మంగళవారం శైలజ అనే మహిళకు చెందిన 12 సవర్ల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. ఆమె తల్లి గాల్ బ్లాడర్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఈ సంఘటన జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.