ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషాహీద్ దర్గా రొట్టెల పండగ సంబంధించి మొత్తం ఐదు కోట్ల రూపాయల నిధులు శనివారం మంజూరయ్యాయి. మంత్రి నారాయణ సహకారంతోపాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషితో ఈ నిధులు మంజూరయ్యాయి. పండుగ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నిధులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. బారాషాహిద్ దర్గా అభివృద్ధితోపాటు పెండింగ్ పనులకు సంబంధించి ఈ నిధులు వినియోగించనున్నారు.