వడ్డెర సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వడ్డెర కార్పొరేషన్ లో పదవులు పొందిన ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురు ఉత్తమ టీచర్లు, ఇటీవల డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన 18 మందికి ఆత్మీయ సన్మానాలు నిర్వహించారు. వడ్డెర సంఘాల ఐక్యవేదిక నాయకులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బండి రమేష్, ఉప్పుభాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించిన 18 మంది వడ్డెర యువతను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గుంజి ఖా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.