నెల్లూరు: అంబేద్కర్ భవన్ పునః ప్రారంభం

6చూసినవారు
నెల్లూరు: అంబేద్కర్ భవన్ పునః ప్రారంభం
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి బుధవారం కొండాయపాలెం గేట్ కూడలిలోని అంబేద్కర్ భవన్‌ను పునఃప్రారంభించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆధునిక వసతులతో నవీకరించిన ఈ భవన ప్రాంగణంలో ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కమిషనర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఎమ్మెల్యే, నిర్వాహకులు, దళిత సంఘాల నాయకులు కమిషనర్‌ను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్