ఏపీ జెఎసి నెల్లూరు నగర నూతన కమిటీని స్థానిక ఎన్జీవో హోమ్ లో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ యూనిట్ ఏర్పడింది. రామకృష్ణారెడ్డి నగర అధ్యక్షుడిగా, జానా వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ గా, సిహెచ్ వి కృష్ణారెడ్డి కార్యదర్శిగా, ఏవి కృష్ణ కుమార్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 22 మందిని ఈసీ సభ్యులుగా ఎన్నుకున్నారు.