జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు, మంగళవారం జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆస్తి నేరాలు, సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలు, బాలబాలికలపై జరిగే నేరాలు, చట్టాలు, శిక్షల గురించి వివరించారు. అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 112 లేదా 1972కు ఫోన్ చేయాలని సూచించారు.