నెల్లూరు: అజారుద్దీన్ కు మంత్రి పదవిపై హర్షం

తెలంగాణ క్యాబినెట్లో మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రివర్గంలో స్థానం దక్కడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. లక్షలాది మంది మైనార్టీల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడం మంచి పరిణామమని ఆయన అన్నారు. తన స్నేహితుడు అజారుద్దీన్ మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని సమీర్ ఖాన్ ఆకాంక్షించారు.
