మొంథా తుపానులో ఉత్తమ సేవలు అందించినందుకు గాను నెల్లూరు కమిషనర్ నందన్, శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో సైక్లోన్ మొంథా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, మెమోంటోలను అందజేశారు. తుపాను విపత్తులో ఉత్తమ సేవలు అందించిన 175 మందిని గుర్తించి సీఎం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.