నెల్లూరు నగరంలో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం త్రివిధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్టిక్కర్లు, ఫ్లాగ్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం త్రివిధ దళాల సేవలను కొనియాడారు. త్రివిధ దళాల పతాక దినోత్సవ నిధికి విరివిగా విరాళాలు అందించాలని సూచించారు.