నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, శుక్రవారం స్థానిక పొగతోట ఎస్ 2 సినిమా హాల్ ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సమీపంలోని భవనాలను సందర్శించి, ప్లాన్ అప్రూవల్ కాపీ, ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ లను తనిఖీ చేశారు. అనుమతులను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను బి. పి. ఎస్ పథకం ద్వారా క్రమబద్ధీకరించుకునేలా టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.