నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని, గురువారం నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణను మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలెక్టర్ బంగ్లాలో కలిసి శుభాకాంక్షలు తెలిపి, మున్సిపల్ శాఖ డైరీని అందజేశారు.