నెల్లూరు పెద్ద బజార్ చేపల మార్కెట్ సమీపంలో షాకిర్ హుస్సేన్ ఇంట్లో నుంచి 24 గ్రాముల బంగారు నగలు మాయమయ్యాయి. ఈ ఘటనపై బాధితులు మంగళవారం చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో 15 రోజుల కిందట పనికి చేరిన షకీలా అనే మహిళపై సీసీ ఫుటేజీల పరిశీలనలో అనుమానం వ్యక్తమైంది. దీంతో పనిమనిషిపైనే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.