నెల్లూరు కు చెందిన కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ సమక్షంలో గురువారం వైసీపీ పార్టీలో చేరారు. ఈక్రమంలో ఓ కేసులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన ఓ వీడియో విడుదల చేసి తాను తిరిగి టిడిపిలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. గతంలో కూడా టిడిపిలో ఉన్నానని, కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్‌సీపీకి వెళ్లానని తెలిపారు. ఇప్పుడు మళ్లీ టిడిపిలో కొనసాగుతున్నానని వీడియోలో పేర్కొన్నారు.