నెల్లూరు: మోదీ, చంద్రబాబు పాలనపై సిపిఐ నేతల ధ్వజం

0చూసినవారు
నెల్లూరు: మోదీ, చంద్రబాబు పాలనపై సిపిఐ నేతల ధ్వజం
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ భయానక రాజకీయాలకు పాల్పడుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ స్వార్థం కోసం ప్రతిపక్ష నేతలను బెదిరించి బీజేపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ప్రభుత్వ యంత్రాంగంతో దాడులు చేయిస్తున్నారని, అదే బీజేపీ కండువా కప్పుకుంటే వారిపై ఉన్న కేసులు మాయమవుతున్నాయని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్