ప్రజా నాట్యమండలి కళాకారుడు, సిపిఎం కార్యకర్త పెంచలయ్య హత్య కేసులో నిందితురాలు అరవ కామాక్షిపై ఆర్డిటి కాలనీలో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఆమెకు చెందిన 5 ఇళ్లను స్థానికులు, టిడిపి, సిపిఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసిన పెంచలయ్యను దారుణంగా హతమార్చడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.