నెల్లూరు జిల్లాను ముందు వరుసలో ఉంచాలి: లంక దినకర్

5చూసినవారు
నెల్లూరు జిల్లాను ముందు వరుసలో ఉంచాలి: లంక దినకర్
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల పథకం అమలుపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ, జిల్లాను విద్యా, వైద్య రంగాల్లో ముందు నిలిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వికసిత భారత్, స్వర్ణాంద్ర ప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్రా, నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్