నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్డు అవసరం లేదు: నారాయణ

3చూసినవారు
నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్డు అవసరం లేదు: నారాయణ
ప్రస్తుతానికి నెల్లూరుకు ఔటర్ రింగురోడ్ అవసరం లేదని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వేయాలన్న నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఉద్దేశం సరైనదేనని, అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్మాణం సాధ్యం కాదని ఆయన అన్నారు. గతంలో ట్రంక్ రోడ్ పైనే ట్రాఫిక్ వెళ్లేదని, రోడ్డును రెండుగా డివైడ్ చేసేవారని, దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండేవని తెలిపారు. మినీ బైపాస్ ఏర్పాటు తర్వాత ట్రంక్ రోడ్ లో ట్రాఫిక్ తగ్గిందని, త్వరలో నాలుగు లైన్ల బైపాస్ ను ఆరు లైన్లు చేస్తున్నారని మంత్రి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్