కోవూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నెల్లూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు సోషల్ మీడియా ప్రభావానికి లోనై చదువులను నిర్లక్ష్యం చేయకూడదని, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన వారు నిరుత్సాహపడకూడదని సూచించారు. విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేసి వారిని అభినందించారు.