మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును ఖండించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ అరెస్టు జరిగిందని ఆయన ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులంతా టీడీపీ వారేనని, అయితే ఇప్పుడు వైయస్ఆర్ సీపీకి ఈ కేసును అంటగట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన ధ్వజమెత్తారు.