నెల్లూరు,: స్నేహితుడి పై కత్తితో దాడి

5చూసినవారు
నెల్లూరు,: స్నేహితుడి పై కత్తితో దాడి
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో కత్తితో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ప్రేమ్ కుమార్ తన స్నేహితుడు అనిల్ కుమార్ కు ఫోన్ చేసి సుమంత్ ఫోన్ నంబరు అడిగాడు. లేదని చెప్పడంతో ఆగ్రహించిన ప్రేమ్ కుమార్, అనిల్ ను దూషించి, తన గ్రామానికి వస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ప్రేమ్ కుమార్ కత్తితో అనిల్ పై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్